భారత్‌కు బంగారు పతకాన్ని సాధించి పెట్టిన 94ఏళ్ల బామ్మ..
- July 12, 2022
ఫిన్లాండ్: 94 ఏళ్ల భగవని దేవి దాగర్ 100 మీటర్లను 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. లేటు వయసులో ఈ రికార్డు సాధించడంతో ప్రపంచం దేశాలు ఆమెను ప్రశంసిస్తున్నాయి. ఫిన్‌లాండ్‌లోని టాంపెర్‌లో 100 మీటర్ల ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. 35 ఏళ్లు పైబడి ఉన్న అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొన్నారు. భగవని దేవికి 94ఏళ్లు ఉన్నా.. అందరినీ వెనక్కనెట్టి ఈ విజయాన్ని సాధించింది.భగవని దేవి దాగర్ హర్యానాలోని ఖిడ్కా గ్రామానికి చెందిన వారు. 100 మీటర్ల స్ప్రింట్‌తో పాటు షాట్‌పుట్‌లో కూడా ఆమె బ్రాన్జ్ పతకాన్ని సాధించింది. కేంద్ర మంత్రి పియుష్ గోయల్ భగవని దేవి దాగర్ విజయ అందరికీ స్పూర్తి అని ట్వీట్ చేశారు. భారత్‌కు 2 పతకాలు సాధించిపెట్టడం గర్వంగా ఉందని, ప్రపంచం ఆమె పాదాల చెంత ఉందని.. 94 ఏళ్ల వయసులో అద్భుతమైన విజయం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..