అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్: ఎందుకంటే.!

- July 12, 2022 , by Maagulf
అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్: ఎందుకంటే.!

నిఖిల్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కార్తికేయ 2’ ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే, గత కొంత కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఒకింత డౌటానుమానాలు వస్తున్నాయ్. 

ఇప్పటికే ఏప్రిల్‌లో రావల్సిన సినిమా జూలైకి పోస్ట్ పోన్ చేసుకుంది. జూలైలోనూ ఈ సినిమా రిలీజ్ కావడం కష్టమే అంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, చిత్ర యూనిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 22న ‘కార్తికేయ 2’ను రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ, కుదరలేదు. ప్రచారాలే నిజమయ్యాయ్. సినిమా మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ కార్తికేయ 2 టీమ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అనూహ్య కారణాల వల్ల సినిమాని పోస్ట్ ‌పోన్ చేసుకుంటున్నామనీ, ఆగస్ట్‌లో రిలీజ్ వుండొచ్చనీ, త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపింది.

అయితే, ఇప్పటికే ఆన్ ‌లైన్ బుకింగ్స ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లకి డబ్బులు తిరిగిస్తామంటూ కూడా ప్రకటించింది. ఎప్పటి నుంచో తన సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు అడియాశలైనందుకు నిఖిల్ సిద్దార్ధ్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపాడు. 

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com