స్పీడు పెంచిన అక్కినేని బుల్లోడు: ఈ సారి పవన్ డైరెక్టర్‌తో.!
- July 12, 2022
సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘వకీల్ సాబ్’. కరోనా ప్యాండమిక్‌లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాసింది. ఈ సినిమాతో డైరెక్టర్‌గా వేణు శ్రీరామ్ మంచి పేరు తెచ్చుకోగా, ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు బీభత్సమైన లాభాలు ఆర్జించి బాగా వెనకేసుకున్నాడు.
అది సరే, ఆ తర్వాత వేణు శ్రీరామ్ తన కొత్త ప్రాజెక్టు గురించి ఏమీ చెప్పలేదు.దిల్ రాజు మాత్రం వరుస సినిమాలతో బిజీగా వున్నారనుకోండి. తాజాగా అక్కినేని కాంపౌండ్ దృష్టి వేణు శ్రీరామ్‌పై పడినట్టు సమాచారం అందుతోంది.
అఖిల్‌తో వేణు శ్రీరామ్ ఓ సినిమా చేయబోతున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘తమ్ముడు’ టైటిల్‌తో ఈ సినిమా రూపొందబోతోందట.. అంటూ సోషల్ కోడి గట్టిగా కూత పెట్టి అరుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి మళ్లీ దిల్ రాజే ప్రొడ్యూసర్ కానున్నాడంటూ తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కానీ, జరుగుతున్న ప్రచారం నిజమైతే అఖిల్ నక్కతోక తొక్కినట్లే మరి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ అంటే కొన్ని లెక్కలుంటాయ్. అలాగే, పవన్ కళ్యాణ్ టైటిల్ అంటే కూడా అంచనాలు ఓ రేంజ్‌లో వుంటాయ్.
మరోవైపు అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!