శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధింపు
- July 13, 2022
కొలంబో: శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. దేశంలో అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. ఆందోళకారుల దెబ్బకు ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు.ఈ రోజు రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.అయితే, తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. అంతేకాదు శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు.ప్రధాని నివాసం గోడఎక్కి లోపలకు దూసుకెళ్లారు.ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. అయినా ఆందోళన కారులు తగ్గడం లేదు. మరోవైపు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







