మరో 3 రోజుల పాటు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు
- July 13, 2022
హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు తెలగాణలోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెలవులను మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా ప్రకటనతో ఈ నెల 18న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వాస్తవానికి తాజా ప్రకటనతో ఈ నెల 16 వరకే విద్యాలయాలకు సెలవులు ఉండగా… 17న ఆదివారం కావడంతో పాఠశాలలు ఈ నెల 18న సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా ఈ వారం మొత్తం పాఠశాలలు తెరచుకోలేదు.
గత శనివారం పని చేసిన పాఠశాలలు ఆదివారం సెలవుతో తిరిగి సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా… వర్షాల కారణంగా 3 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవులు ముగియనున్న బుధవారం మరో 3 రోజుల పాటు సెలవులను పొడిగించారు. వెరసి తెలంగాణలో వరుసగా 8 రోజుల పాటు విద్యాలయాలు మూపడిపోయినట్టైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







