బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న రిషి సునాక్

- July 14, 2022 , by Maagulf
బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న రిషి సునాక్

లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్‌ లో ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు.

మిగతా అభ్యర్థులైన లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి నిష్క్రమించారు.

అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది.

Telugu News » International News » Rishi Sunak Leads In Race To Be Boris Johnsons Replacement
Britain PM: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న రిషి
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్‌ లో ఆధిక్యం సాధించారు.

Edited By: 10TV Digital Team ,July 14, 2022 / 08:40 AM IST     google_news
Britain PM: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న రిషి
Britan PM: భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్‌ లో ఆధిక్యం సాధించారు. అత్యధికంగా 88 మంది పార్టీ ఎంపీల ఓట్లను గెలుచుకోగా.. ప్రధాన పోటీదారు పెన్నీ మోర్డంట్‌ 67 ఓట్లతో గట్టి పోటీ ఇస్తున్నారు.

PlayUnmute
Fullscreen
VDO.AI
మిగతా అభ్యర్థులైన లిజ్‌ ట్రస్‌ (50 ఓట్లు), కేమీ బదెనోక్‌ (40)తో పాటు భారత సంతతికి చెందిన అటార్నీ జనరల్‌ సుయెల్లా బ్రేవర్మన్‌ (32) కూడా తొలి రౌండ్‌లో మంచి ఫలితాలనే సాధించారు. ఇదిలా ఉంటే, కనీసం 30 మంది ఎంపీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన నదీం జహావీ, జెరెమీ హంట్‌ రేసు నుంచి నిష్క్రమించారు.

అలా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. ఎంపీల మద్దతులో రిషి దూసుకుపోతుండగా కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో పెన్నీకి మద్దతు పెరుగుతున్నట్టు వస్తున్న సమాచారంతో ఎన్నికపై ఉత్కంఠత పెరిగిపోతుంది.

గురువారం కన్జర్వేటివ్‌ ఎంపీలు తమ ఫేవరెట్‌ అభ్యర్థులను ఎన్నుకుంటారు. జూలై 21కల్లా ఇద్దరు అభ్యర్థులు మాత్రమే మిగులుతారు. టాప్ 2లో ఉన్న రిషి, పెన్నీయే రేసులో ఉంటారని అంచనా. తర్వాత 2 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల్లో అత్యధిక మంది సపోర్ట్ కూడగట్టుకునే వారే పార్టీ నేతగా ఎన్నికై సెప్టెంబర్‌ 5న ప్రధాని పదవిని అందుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com