ఆసుపత్రి లో చేరిన తమిళనాడు సీఎం స్టాలిన్
- July 14, 2022
చెన్నై: కరోనా తో బాధపడుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆసుపత్రి లో చేరారు. స్టాలిన్ కు జలుబు, జ్వరం ఇతర లక్షణాలు ఉండటంతో మంగళవారమే టెస్టు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ గా తేలింది. అప్పటి నుంచి ఆయన నివాసంలోనే ఉండి చికిత్స తీసుకుంటూ వచ్చారు. తనకు కరోనా సోకినా విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని , మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని కోరారు. అయితే కరోనా లక్షణాలు పెరగడంతో ఆయనకు పలు వైద్య పరీక్షలు చేసేందుకు, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గురువారం ఆస్పత్రికి తరలించారు. అయితే వైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేసుకున్నారు.
కరోనా లక్షణాలపై వైద్య పరీక్షలు, అబ్జర్వేషన్ నిమిత్తం స్టాలిన్ చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉన్న కౌవరీ ఆస్పత్రిలో చేరినట్టు ఆ ఆస్పత్రి యాజమాన్యం గురువారం ప్రకటించింది. స్టాలిన్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారమే స్టాలిన్ కు ఓ లేఖ రాశారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం కూడా సీఎం స్టాలిన్ వేగంగా కోలుకుని, తిరిగి ప్రజా సేవలో అంకితం కావాలని ఆశిస్తున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







