బాబాయ్-అబ్బాయ్ సినిమా!
- April 12, 2016
మెగా ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా అభిమానులకి విపరీతమైన క్రేజ్ , చిరంజీవి - పవన్ కళ్యాణ్ .. చరణ్ - చిరంజీవి ఇలా ఏ కాంబినేషన్ కలిసి పనిచేసినా ఫాన్స్ ఫుల్ ఖుషీ అవ్వడమే కాక సాధారణ ప్రేక్షకులు కూడా ఆ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తారు. అలాంటిది బాబాయ్ పవన్ కళ్యాణ్ అబ్బాయ్ రాం చరణ్ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పనిచేస్తే ఇక ఫాన్స్ కి పండగే అని చెప్పచ్చు. అయితే తెర మీద కాదు కానీ తెర వెనకాల వీరిద్దరూ ఒక సినిమాకి కమిట్ అయ్యి చాలా కాలం అయ్యింది.
బ్రూస్ లీ కంటే ముందరే తాను పవన్ కళ్యాణ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఒక సినిమా తీయబోతున్నా అని రాం చరణ్ స్వయంగా ప్రకటించాడు. ఆ సినిమా కి త్రివిక్రమ్ డైరెక్టర్ అవ్వచ్చు అని కూడా చరణ్ హింట్ ఇచ్చాడు. ఈ విషయం మీద పవన్ ఏమీ మాట్లాడలేదు , అలాగే ఖండించనూ లేదు సో సినిమా పక్కా ఉంటుంది అనుకున్నారు ఫాన్స్ కూడా. ఇలోగా బ్రూస్ లీ రావడం చరణ్ కెరీర్ లో అతిపెద్ద డిసాస్టర్ గా మారడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తానీ ఒరువన్ తో హిట్ కొట్టాలని గట్టి నిర్ణయం తో ఉన్న చరణ్ కి ఈ ప్రాజెక్ట్ మీద టైం కేటాయించే పరిస్థితి లేదు అంటున్నారు. ఇలా ఇలా కొనసాగిస్తూ మొత్తానికి వీరిద్దరి ప్రాజెక్ట్ నీ అటక ఎక్కిస్తారు అనే టాక్ నడుస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









