దోసకాయ పెరుగన్నం
- April 12, 2016
కావలసినవి: అన్నం ఒక కప్పు, తాజా పెరుగు ఒక కప్పు, దోసకాయ (తోలు తీయకుండా సన్న ముక్కలు కోసుకుని) పావుకప్పు, కొత్తిమీర పావు కప్పు, ఉప్పు తగినంత.
తిరగమోతకు: జీలకర్ర ఒక టీ స్పూను, పచ్చి మిర్చి 2, పొట్టుతీయని బద్ద మినపప్పు ఒక టేబుల్ స్పూను, ఇంగువ ఒక టీ స్పూను, కరివేపాకు కొంచెం, నూనె ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం:
పెద్ద గిన్నె తీసుకుని అన్నం, పెరుగు, దోసకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. కావలసిన వాళ్ళు కేరట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేడెక్కాక ముందు జీలకర్ర, తర్వాత మినపప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. ఈ తిరగమోతను పెరుగన్నంలో కలిపి ఫ్రిజ్లో పెట్టి చల్లబడ్డాక తినండి. బాగుంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







