దోసకాయ పెరుగన్నం

- April 12, 2016 , by Maagulf
దోసకాయ పెరుగన్నం

కావలసినవి:  అన్నం ఒక కప్పు, తాజా పెరుగు ఒక కప్పు, దోసకాయ (తోలు తీయకుండా సన్న ముక్కలు కోసుకుని) పావుకప్పు, కొత్తిమీర పావు కప్పు, ఉప్పు తగినంత.

తిరగమోతకు: జీలకర్ర ఒక టీ స్పూను, పచ్చి మిర్చి 2, పొట్టుతీయని బద్ద మినపప్పు ఒక టేబుల్‌ స్పూను, ఇంగువ ఒక టీ స్పూను, కరివేపాకు కొంచెం, నూనె ఒక టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం:
పెద్ద గిన్నె తీసుకుని అన్నం, పెరుగు, దోసకాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపుకోవాలి. కావలసిన వాళ్ళు కేరట్‌ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పొయ్యి మీద పాన్‌ పెట్టి నూనె వేడెక్కాక ముందు జీలకర్ర, తర్వాత మినపప్పు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. ఈ తిరగమోతను పెరుగన్నంలో కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడ్డాక తినండి. బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com