ఫార్మ‌సిస్ట్‌ పై కాల్పులు జరిపిన సౌదీ మహిళ...

- July 16, 2022 , by Maagulf
ఫార్మ‌సిస్ట్‌ పై కాల్పులు జరిపిన సౌదీ మహిళ...

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఫార్మ‌సిస్ట్‌గా పని చేస్తూ.. తండ్రి క్యాన్సర్ చికిత్సకు అవసరమైన డబ్బులు సంపాదిస్తూ.. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఇంతలో ఘోరం జరిగిపోయింది. మహిళ కోపానికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. 

ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ అతేమ్.. ఉద్యోగం కోసం గత ఏడాది సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఓ మెడికల్ షాపులో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నాడు. ఇలా పని చేయడం ద్వారా వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకోవడంతోపాటు క్యాన్సర్ బారిన పడిన తన తండ్రికి చికిత్స చేయిస్తున్నాడు. అయితే.. అహ్మద్.. ఓ మహిళ కోపానికి బలైపోయాడు. సౌదీ అరేబియాలో నిబంధనలు కఠినంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వడం సౌదీ అరేబియాలో నేరం. అందువల్ల  ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాపునకు వచ్చిన సౌదీ మహిళకు.. యాంటిబయోటిక్ మెడిసిన్స్ ఇచ్చేందుకు అతడు నిరాకరించాడు. దీంతో సదరు మహిళ ఆగ్రహానికి గురైంది. బ్యాగులోంచి తుపాకీ తీసి, అతడిపై కాల్పులు జరిపింది. ఈ దాడిలో అహ్మద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

అహ్మద్ కు ఒక చిన్న కొడుకు, భార్య మరియు కేన్సర్‌తో పోరాడుతున్న తండ్రి ఉన్నారు.
ఇమిగ్రేషన్ మంత్రిత్వ శాఖ తన ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేసిన ఒక ప్రకటనలో, అంబాసిడర్ నబీలా అక్రమ్ మృతుడి కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు మరియు అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వదేశానికి తరలించడానికి చర్యలు తీసుకున్నట్లు ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com