సోషల్ మీడియా అలవాటు నుండి బయటకు రావటం ఎలా?

- July 16, 2022 , by Maagulf
సోషల్ మీడియా అలవాటు నుండి బయటకు రావటం ఎలా?

నమస్కారం,
నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నా.నేను మామూలుగా చాలా మంచి స్టుడెంట్ ని .ఈ మధ్య సరిగ్గా చదవలేకపోతున్నా. ఎక్కువసేపు చదువు మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నా.ట్విట్టర్, వాట్సాప్,ఇంస్టాగ్రామ్ చూస్తూ కూర్చుంటున్నా.ఈ అలవాటు మాని మళ్ళీ నేను ఇదివరకటి లాగా చదవగలనా అనిపిస్తోంది. ఏమైనా సలహా ఇవ్వగలరు.
                                                                                                    - విజయవాడ నుండి

జవాబు: నమస్కారం , మీరు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నా అంటున్నారు కదా. మీరు చెప్పిన ఈ సోషల్ మీడియా అలవాటు మీకు ఒక్కరికే కాదు,ఇప్పుడు ఉన్న జెనరేషన్  పిల్లలు అందరూ ఎదుర్కుంటున్న సమస్య.

ముఖ్యంగా కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆన్లైన్ క్లాస్సేస్ వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అయ్యింది. మీకు  దీని నుండి ఎలాగైనా బయటకి రావాలి అన్న ఆలోచన రావటం హర్షించదగిన విషయం.

ఈ అలవాటు నుండి బయటకు రావటం చాలా కష్టం,మీకు పట్టుదల ఉంటె ఈజీ గా వదిలించుకోవచ్చు.
1. వాట్సాప్ లో  అవసరం లేని గ్రూప్స్ నుండి బయటకు వచ్ఛేయ్యండి. మీకు చదువుకి
    సంబంధించిన గ్రూప్స్ లో మాత్రమే ఉండండి. ఎక్కువ అవసరం లేకపోతే ఇంస్టాగ్రామ్
     అకౌంట్ కొన్ని రోజులకి డిలీట్ చెయ్యండి.
2. అసైన్మెంట్స్ లేదా నోట్స్ లాంటివి సాధ్యమైనంత వరకు కాలేజీ లోనే నోట్ చేసుకోండి.
     ఒక వేళా ఒక రోజు మానేస్తే మర్నాడు మళ్ళీ క్లాస్ లోనే అడగటం లాంటివి అలవాటు
     చేసుకోండి.
3. ఇంటికి వచ్చాక మాత్రం సాధ్యమైనంత వరకు మీ మొబైల్ లేదా కంప్యూటర్ వాడద్దు .
4. రిఫరెన్స్ కోసం గూగుల్  కాకుండా  కాలేజీ లైబ్రరీ లో పుస్తకాలు చదవండి.
5. ఇంకా మీరు ఎక్కువ సమయం వాకింగ్  లేక మీకు నచ్చిన  ఏ ఇతర హాబీస్ మీద వెచ్చించండి.
    ఇవి కొన్ని రోజులు పాటించి  నాకు వ్రాయండి . ఇంకా తగ్గకపోతే మనం వేరే మార్గాలు కూడా             ప్రయత్నం చేద్దాం.

--ఉమాదేవి వాడ్రేవు(సైకాలజీ కౌన్సిలర్ )

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com