మెక్ డోనాల్డ్ ఉచిత బ్రేక్ ఫాస్ట్
- April 12, 2016
మెక్ డోనాల్డ్ సంస్థ తమ ఔట్‌లెట్స్‌లో ఈ రోజు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందిస్తోంది. నేషనల్ బ్రేక్ ఫాస్ట్ డే సందర్భంగా 13 ఏప్రిల్ అంటే, బుధవారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ఎగ్ మెక్ ముఫ్ఫిన్స్‌ని ఉచితంగా అందిస్తుంది. మొత్తం వెయ్యి ఎగ్ మెక్ ముఫ్ఫిన్స్‌ని ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. యూఏఈ మెక్ డోనాల్డ్స్ పార్ట్‌నర్, మేనేజింగ్ డైరెక్టర్ రఫిక్ ఫాకిహ్ మాట్లాడుతూ, బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ ఉపయోగాలపై అవగాహన కల్పించడం ఈ ఆఫర్ వెనుక ఉద్దేశ్యమని అన్నారు. తమ సంస్థ నేషనల్ బ్రేక్ ఫాస్ట్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని, వరుసగా నాలుగేళ్ళు ఈ కార్యక్రమంలో భాగమయ్యామని ఆయన అన్నారు. రాత్రంతా ఏమీ తినకుండా ఉండడం వల్ల ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరమని ఆయన చెప్పారు. కొంతమంది బ్రేక్ ఫాస్ట్‌ని లైట్ తీసుకుంటారనీ, అది అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆయన చెప్పారు. మెక్ డోనాల్డ్స్ బ్యాలెన్స్‌డ్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో పలు ప్రోడక్ట్స్‌ని వినియోగదారులకు అందిస్తోందని రఫిక్ వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







