సౌదీలు లేనప్పుడే వలసదారులకు రిక్రూట్‌మెంట్
- April 12, 2016
హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ఫండ్ (హదాఫ్) ప్రకారం, ప్రైవేట్ సెక్టార్‌లో రిక్రూట్‌మెంట్స్ జరిపేటప్పుడు తొలి ప్రాధాన్యత సౌదీలకే ఇవ్వాల్సి ఉంటుంది. సౌదీలు లేనప్పుడే వలసదారులకు అవకాశం దక్కుతుంది. ఈ కొత్త రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి ప్రాసెస్ లేబర్ మినిస్ట్రీకి చెందిన ఎలక్ట్రానిక్ నేషనల్ గేట్‌కి పంపబడింది. ఫండ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ఒమర్ మిలిబారి చెబుతూ, స్థానికులకే వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు దక్కేలా ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని అన్నారు. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని ఆయన వివరించారు. సౌదీ గెజిట్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో వలసదారులకు దాదాపుగా ఉద్యోగాలు లేనట్లే. నిబంధనలకు విరుద్ధంగా గనుక వలసదారుల్ని, సౌదీలకు దక్కాల్సిన ఉద్యోగాల్లో నియమిస్తే కఠిన చర్యలు తప్పవు. నిబంధనల్ని అతిక్రమించినవారికి 20,000 సౌది రియాల్స్ ఫైన్ విధించనున్నారు. అరబిక్, ఇస్లామిక్ స్టడీస్ మరియు సోషల్ సైన్సెస్ చెప్పే టీచర్ల విషయంలోనూ సౌదీలకే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన గెజిట్ మార్చ్ 20న వెల్లడయ్యింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







