నడకతో క్యాన్సర్, డయాబెటిస్‌ను అధిగమించిన 82 ఏళ్ల ఎమిరాతీ
- July 18, 2022
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని పర్వత ప్రాంతమైన వాడి అల్ ఖోర్లో నివసించే సేలం మొహమ్మద్ అల్ కాబీ(82) నడకతో క్యాన్సర్, మధుమేహాన్ని అధిగమించాడు. తాను తహజ్జుద్ ప్రార్థన తర్వాత రోజుకు 10 నుండి 12 కిలోమీటర్లు నడిచినట్లు అల్ కాబీ చెప్పారు. రోజూ మధ్యాహ్నం వేళల్లో పొలానికి వెళ్లి మగ్రిబ్ నమాజుకి ముందు ఇంటికి వచ్చేటప్పటికి గంటసేపు నడుస్తానని తెలిపాడు. తాను ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడ్డానని తెలిపారు. తనకు చాలా కాలంగా వాకింగ్ అలవాటు ఉన్నదని, ప్రస్తుతం తన బరువు ప్రస్తుతం 49 కిలోగ్రాములుగా పేర్కొన్నాడు. రెగ్యులర్ భోజనం తీసుకుంటాను.. సమయానికి నీరు త్రాగుతూ ఉంటానని తెలిపారు. యువతీ యువకులు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా నడక, నీళ్లు తాగడం, నిత్యం భోజనం చేయడం వంటివి చేయమని అల్ కాబీ సలహా ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







