మాజిద్ అల్ ఫుట్టైమ్ సరికొత్త క్యారీఫోర్ స్టోర్ ప్రారంభం
- July 18, 2022
సౌదీ: మధ్యప్రాచ్యం, ఆఫ్రికా,ఆసియాలో షాపింగ్ మాల్స్, ఇంటిగ్రేటెడ్ సిటీలు, రిటైల్ సంస్థలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేయడం.. నిర్వహించడంలో అగ్రగామి సంస్థ అయిన మాజిద్ అల్ ఫుట్టైమ్ ఈ నెల ప్రారంభంలో దమ్మామ్‌లోని అల్ నూర్ జిల్లాలో తన కొత్త శాఖను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, మజిద్ అల్ ఫుట్టైమ్ సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యారీఫోర్ సౌదీ సీఈఓ మహమ్మద్ అల్-అసాఫ్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా మార్కెట్లో రిటైల్ రంగాన్ని ఉన్నతీకరించడం, సౌదీ యువతకు ఉద్యోగాలను కల్పించడం, విజన్ 2030 యొక్క నేషనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్‌కు సహకరించడం ద్వారా ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించడం అనే బ్రాండ్ మిషన్‌లో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. 60 నిమిషాలలోపు ఉచిత ఆన్‌లైన్ డెలివరీని క్యారీఫోర్ అందిస్తుందని, ఈ స్టోర్ లో వివిధ దేశాలకు చెందిన గ్లూటెన్ & షుగర్ లేని వస్తువులు, వంటకాలతో సహా అనేక రకాల సేంద్రీయ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్‌లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







