ఓటు వేసిన ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు
- July 18, 2022
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు ఓటు వేశారు. అలాగే, రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఓటు వేసేముందు మోదీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ పార్లమెంటు సమావేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయని చెప్పారు. ఇదే సమయంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నామని తెలిపారు.
త్వరలో పంద్రాగస్టు రానుందని గుర్తుచేశారు. 25 ఏళ్ళలో దేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుందని చెప్పారు. మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, దేశాన్ని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళడానికి తీర్మానాలు చేసుకోవాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. కాగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు ఓట్లు వేయడానికి క్యూ కట్టారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







