రాజ్యసభ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా
- July 18, 2022
న్యూ ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన కాసేపటికే రేపటికి వాయిదాపడ్డాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు పై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేసాయి. అయితే సభను ఆర్డర్ లో పెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రయత్నించారు. అయినప్పటికీ సభ్యుల వినకపోవడంతో సభను రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
అంతకుముందు జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్ శివకుమార్ శర్మ తదితరుల మృతి పట్ల రాజ్యసభ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభ వాయిదా పడింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







