ఇలియానా ప్రేమ పురాణం: ఈ సారి గట్టిగానే.?
- July 18, 2022
గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ ప్రేమలో పడిందా.? అంటే అవుననే సంకేతాలే వినవస్తున్నాయ్. అవునా.? ఈ సారి ఇలియానా ఎవరి ప్రేమలో పడిందబ్బా.! అనుకుంటున్నారా.? అయితే అర్జెంటుగా ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం పదండిక.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రతినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో ఇలియానా పీకల్లోతు ప్రేమలో వుందట. డేటింగ్ కూడా షురూ చేసిందట ఈ సెబాస్టియన్ తో.
ఈ విషయం ఎలా తెలిసిందంటారా.? రీసెంట్గా క్రతినా కైఫ్ తన బర్త్‌డే వేడుకల్ని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంది తన కుటుంబ సభ్యుల మధ్యనే. ఆ కుటుంబ సభ్యుల్లో ఇలియానా కూడా వుండడంతో ఈ విషయం తేట తెల్లమైంది.
తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలను కత్రినా కైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోస్‌లో కత్రినా తన హజ్బెండ్‌తో పాటు, తన సోదరుడు సెబాస్టియన్ కూడా వున్నాడు. ఆ సోదరుడి పక్కనే చెట్టాపట్టాలేసుకుని కనిపించింది గోవా బ్యూటీ ఇలియానా.
దాంతో నెటిజన్ల ఆరాకు చిక్కిన విషయమేంటంటే, బెల్లీ భామ మళ్లీ ప్రేమలో పడిందని. పడితే పడింది. ఈ సారైనా పెళ్లి చేసుకుంటుందా.? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆండ్రూ అనే ఫోటోగ్రాఫర్‌తో ఇల్లూ బేబీ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..