భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు మిస్సింగ్..
- July 19, 2022
భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోయారు. రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.కాగా ఈ 19 మందిలో ఒకరు విగతజీవిగా కనిపించారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ కార్మికులకు లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







