చట్టవిరుద్ధంగా విల్లా సబ్‌లెట్.. అద్దెదారుకు Dh300,000 జరిమానా
- July 20, 2022
అబుదాబి: ఒక విల్లాను చట్టవిరుద్ధంగా విభజించి నాలుగు కుటుంబాలకు సబ్‌లెట్ చేసిన అద్దెదారు నష్టపరిహారంగా ఇంటి యజమానికి Dh300,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. తన విల్లాను అక్రమంగా సబ్ లెట్ చేసిన అద్దెదారుపై విల్లా యజమాని కోర్టులో దావా వేశారు. తన అనుమతి లేకుండా అద్దెదారుడు ఇతర కుటుంబాలకు సబ్‌లెట్ చేయడం వల్ల నష్టం జరిగిందని అతను పేర్కొన్నాడు. ఇది అబుదాబిలోని హౌసింగ్ చట్టాలను ఉల్లంఘించడమేనని కూడా ఫిర్యాదుదారు వాదించారు. అద్దెదారు తన విల్లాకు పునరుద్ధరణ, నిర్వహణకు పరిహారంగా Dh510,000 చెల్లించాలని యజమాని డిమాండ్ చేశాడు. అలాగే అద్దెదారు తనఇంటిని ఖాళీ చేయించాలని అతను కోర్టును అభ్యర్థించాడు. ఇరువురి వాదలు విన్న అబుదాబి ఫ్యామిలీ కోర్ట్.. సివిల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్‌ల కోసం ప్రతివాది హౌసింగ్ నిబంధనలను ఉల్లంఘించాడని, మార్పులు చేయడం వల్ల విల్లాకు నష్టం వాటిల్లిందని తీర్పు చెప్పింది. నష్టపరిహారంగా ఫిర్యాదుదారుడికి Dh300,000 చెల్లించాలని న్యాయమూర్తి అద్దెదారున్ని ఆదేశించారు. అలాగే ఇంటియజమానికి న్యాయపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







