గుండె మార్పిడికి LVAD ప్రత్యామ్నాయం అంటున్న వైద్యులు

- July 20, 2022 , by Maagulf
గుండె మార్పిడికి LVAD ప్రత్యామ్నాయం అంటున్న వైద్యులు

హైదరాబాద్: సాధారణంగా గుండె ఆపరేషన్ చేసేటప్పుడు రక్తాన్ని ఒక యంత్రం గుండా ప్రసరింప చేసి క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తారు.అయితే ఈ యంత్రం కొన్ని గంటలు మాత్రమే గుండెకు సహాయంగ నిలుస్తుంది.శరీరంలో ఈ తీరుగా పనిచేయగల అతిచిన్న యంత్రాన్ని కనుగొనడానికి చాల సంవత్సరాలుగా కృషిచేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా గుండె పనితీరు తగ్గడం వలన (హార్ట్ ఫెయిల్యూర్) బాధపడుతున్న వారి సంఖ్యా కొన్ని లక్షల్లో ఉంటుంది.ప్రస్తుతం వీరికి కేవలం గుండె మార్పిడి (హార్ట్ ట్రాన్స్ప్లాంట్) మాత్రమే చికిత్స రూపంలో లభ్యంగా ఉన్నది.అయితే గుండె మార్పిడికి కావాల్సిన ముఖ్యమైన వస్తువు మరొకరి గుండె, అంటే ఏదయినా కారణం చేత  ఒక వ్యక్తి బతికే అవకాశం లేకపోతే వారి గుండె ఇతర అవయవాలను వేరే వారికీ అమర్చడం అన్న మాట.ఈ ప్రక్రియ జరగాలంటే బ్లడ్ గ్రూప్ కలవాలి , అలాగే సరైన సమయానికి అవయవం  అందుబాటులో ఉండాలి.చాల మంది అవయవాలు సరైన సమయానికి అందుబాటులోకి రాకముందే ప్రాణాలను కోల్పోతున్నారు.అందుకే చాల కంపెనీలు హార్ట్ లంగ్ మెషిన్ ని చిన్నగా చేసి శరీరంలో అమర్చి కలిగేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గత 20 సంవత్సరాల కృషి మూలంగా వెంట్రిక్యూలర్  అసిస్ట్  డివైస్ అనే చిన్న యంత్రాన్ని తయారుచేయడం జరిగింది. ఈ యొక్క పరికరం పేరు హార్ట్ మెట్ 3 (Heart mate 3).

గుండె మార్పిడి కోసం వేచియున్న రోగులకు వాడే వారు (Bridge therapy). కానీ చాల పరిశోధన , కృషి మూలంగా ఇప్పుడు వీటిని శాశ్వతంగా అమర్చగలుగుతున్నాం.ఈ విధంగా అమర్చిన పరికరాలు దాదాపు 10 సంవత్సరాలు వరకు పనిచేస్తున్నాయి.వీటిని అమర్చిన రోగులు రక్తం పల్చబడే మాత్రలు వాడితే సరిపోతుంది.దీనితో పోలిస్తే గుండె మార్పిడి చేసిన వారు వారి రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు వాడవలిసి ఉంటుంది.

ఈ హార్ట్ మెట్ 3 ని VAD  లేదా వెంట్రిక్యూలర్ అసిస్ట్ డివైస్ అంటారు. ఎందుకంటే ఏ జఠరిక అయితే సరిగ్గా పనిచేయడం లేదో దానికి సహాయంగా నిలుస్తుంది. దానిని బట్టి ఇవి LVAD (ఎడమ వైపు VAD), RVAD (కుడి వైపు VAD) లేదా BIVAD (రెండు జఠరికలకు సహాయం చేసేవిగా గుర్తించవచ్చు).

ఈ యొక్క పరికరం విశిష్టత ఏమిటి అంటే కేవలం 200 గ్రాముల బరువు ఉంటుంది. అరచేతిలో అమరగల పరికరం (సగటు మొబైల్ ఫోన్ లాగా). దీనిని అమర్చడంకూడా చాల సులువు . ఇది సెంట్రిఫుగాళ్ పుంపులాగా పనిచేస్తుంది. దీని ముఖ్యమైన భాగం ఒక చిన్న చక్రం, ఇది రక్త ప్రవాహ దారిలో ఉంటూ మాగ్నెటిక్ లేవిటేషన్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది (అంటే ఒక మాగ్నెట్ దీనిని తిప్పుతుంది, దానివలన రక్తం ముందుకు ప్రవహిస్తుంది). చక్రం తిరగటం వల్ల మజ్జిగ చిలికినట్లుగా రక్తాన్ని చిలికి ముందుకు ప్రవహింప చేస్తుంది.ఈ సాంకేతిక మూలంగా కేవలం రక్తం పల్చన చేసే ఒక రకమైన మందు బిళ్ళ వాడితే సరిపోతుంది.నెలొకొకసారి రక్తం ఎంత పల్చబడిందని పరీక్షించుకుంటే చాలు.దీనిని తాత్కాలికంగా కానీ దీర్ఘకాలికంగా కానీ పనిచేయటానికి అమర్చవచ్చు.

మెడికవర్ లో హార్ట్ మెట్ 3 అమరిక
63 సంవత్సరాల రుక్మిణమ్మ తన భర్త బాగోగులు చూసుకునేది. ఆయన మరణించిన పిమ్మట ఆమె తన ఆరోగ్యం గురించి గమనించడం ప్రారంభించింది.ఆమె కొద్దీ దూరం నడిస్తే ఆయాసం రావడం గమనించింది. కొన్ని రోజుల్లోనే వ్యాధి ముదిరి కొన్ని గజాలు కూడా నడవలేకపోవడం, అలాగే తన దినచర్యలు చేయలేకపోవడం కూడా తనకు స్పష్టం అయినది. ఒకరోజు ఆమెకు తీవ్రంగా శ్వాస ఆడకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఆమె గుండె సరిగా పని చేయడం లేదని, హార్ట్ పంపింగ్ కేవలం 25 శాతం మాత్రమే ఉందని తేలింది (సాధారణంగా 65  శాతం ఉండాలి). గుండె పంపింగ్ తగ్గడానికి సరైన కారణం దొరకలేదు. వైద్య పరిభాషలో డైలేటెడ్ కార్డియో మయోపతి అని అంటారు. సాధారణంగా వాడే మందులు సరిపడలేదు. ఆమె పరిస్థితికి రెండు పరిష్కారాలు ఉన్నాయి. గుండె మార్పిడి లేదా VAD అమరిక. ఆమె వయస్సు రీత్యా ఆమెకు వేరొకరి గుండె దొరికే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఆమెకు VAD సరిఅయిన చికిత్స అని నిర్ణయించడం జరిగింది. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత VAD ఆమె ఆయాసాన్ని తగ్గించడమే కాక జీవితాన్ని పొడిగిస్తుందని ఒప్పించడం జరిగింది. ఆమె ఆకారంలో చిన్నదిగ ఉన్నా ఈ పరికరం చక్కగా అమరింది. 5 -6 గంటలు జరిగిన క్లిష్టమైన ఆపరేషన్ తరువాత ఆమె సురక్షితంగా ఐసీయూకి చేరింది. ఈ పరికరం బ్యాటరీలతో నడుస్తుంది కాబట్టి 17 గంటల వరకు రోగి తన దైనందిన పనులు చేసుకోవచ్చు. ఈ హార్ట్ మెట్ 3  అతిచిన్న పరిమాణంగల వ్యక్తిలో అమర్చడం ప్రపంచంలో ఇదే మొదటసారి. ఈ ఆపరేషన్ దేశంలో 100 వదిగా తెలుగు రాష్టాల్లో 6 వదిగా గుర్తించాలి. ఐసీయూలో ఉండగా ఆమెకు స్వల్ప పక్షవాతం వచ్చినది కానీ దాని నుంచి కోలుకొని ఇంటికి చేరి ఇప్పుడు తనపనులు తానే చేసుకోగలుగుతుంది. ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు.

ఈ పరికరం యొక్క మేలైన అంశాలు ఏమిటంటే సరళమైన డిజైన్, చిన్న పరిమాణం , సులభతరమైన అమరిక విధానం, జీవన నాణ్యతలో తక్షణ మెరుగుదల , ఆయాసం రాకుండా నడవగలగడం అతి తక్కువ మందుల అవసరం.

మెడికవర్  హాస్పిటల్స్ లో ప్రత్యేకమైన హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ ఉంది.ఈ క్లినిక్ లో గుండె పనితనం తగ్గినా రోగులను గుర్తించి తగిన చికిత్స విధానాలు నిర్ణయిస్తారు. రోగులు మందులకు సరైన స్పందన చూపకపోతే వారికి VAD కానీ గుండె మార్పిడిలో ఏది మెరుగైనదో గుండె నిపుణుల బృందం నిర్ణయిస్తుంది.ఇటువంటి అత్యాధునిక సాంకేతికను అందించగల ప్రత్యేక కేందారంగా మెడికవర్ హాస్పిటల్స్ ఉద్భవించింది.

ఈ యొక్క క్లిష్టమైన సర్జరీ చేసిన కార్డియాలజిస్టులు డాక్టర్ రామగిరి బాలాజీ, డాక్టర్ నితిన్ అన్నారపు మరియు కార్డియాక్ సర్జన్స్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ డాక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మితిలేష్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com