పంజాబ్‌లో ఎన్‌కౌంటర్..
- July 20, 2022
పంజాబ్: ఇటీవల మరణించిన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకులకు, పోలీసులకు మధ్య పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరుగుతోంది.ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ మరణించినట్లు సమాచారం.అమృత్‌సర్ సమీపంలోని, అత్తారి సరిహద్దులో ఉన్న భన్కా గ్రామంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.
సిద్ధూ మూసేవాలా హంతకులుగా భావిస్తున్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ ఈ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పట్టుకోవడానికి భన్కా గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య వందల రౌండ్ల కాల్పులు జరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడైన జగ్‌రూప్ సింగ్ అలియాస్ రూప హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ మన్ను కుసా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మన్ను కుసా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాడు.
ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. సిద్ధూ హత్యకు ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నిన సంగతి తెలిసిందే. సిద్ధూను చంపే బాధ్యతను షూటర్లైన మన్‌ప్రీత్ సింగ్‌కు, జగ్‌రూప్ సింగ్‌కు అప్పగించాడు. వీరి ఆధ్వర్యంలోనే సిద్ధూ హత్య జరిగినట్లు అంచనా. ఇంకా ఈ ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.యాంటీ-గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ విక్రమ్ బ్రార్ ఆధ్వర్యంలో ఈ ఎన్‌కౌంటర్ సాగుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







