దూరాలు
- April 12, 2016
నోట్లోనే ముడుచుకొని పడుకున్న నాలుక
మాట్లాడేందుకు మిగిలిందేదీ లేనంత నిశ్శబ్దం
నువ్వు నాతో మాట్లాడవు
మునపటిలా నీలా
పసలేని పాతంతా ఇప్పుడొక రోత
కొన్ని రాళ్ళు
కొన్ని పువ్వులు
మీదకు విసిరేయబడినవి ఏవైతేనేం
జ్ఞాపకాలై మిగిలినందుకు అదృష్టమే
వేసుకున్న చెప్పులు
తొడుక్కున్న బట్టలు
గర్వంగా గారాలు పోతున్న ఛాతి మీది బరువైన కీస
నాకెప్పటికీ అర్థంకాని కొత్త భాషను నేర్పించాయి
నీకిప్పుడు
దాచుకున్నవన్నీ చేరోసగం పంచుకో గలిగాం
పంచుకున్నవన్నీ పదిలంగా దాచుకోలేక పోయాం
ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నారు
మన ప్రపంచమింకా ఒంటరిగానే వుంది
రాత్రిళ్ళు నిద్ర పట్టక
తెల్లార్లు మెలకువ రాక
కదిలే ఘడియల అడుగుల సవ్వడు లిప్పుడు
ఊపిరి పోసుకుంటున్న దూరాలు
--పారువెల్ల(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









