మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- April 16, 2026
సైబరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు అరెస్ట్ చేశారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.మధు మరియు అతని బృందం అమాయకుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 60కి పైగా కేసులు నమోదయ్యాయి.ఇప్పటికే సీఐడీ ఈ కేసును విచారిస్తుండగా, తాజాగా సైబరాబాద్ EOW లో కూడా కేసు నమోదు కావడంతో మధు చుట్టూ ఉచ్చు బిగిసింది.
కాగా మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీ పేరు తెరపైకి వచ్చింది. మంగ్లీ పై లాయర్ సుబ్బారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు వసూళ్ల వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఉందని లాయర్ సుబ్బారావు అంటున్నారు. లాయర్ సుబ్బారావు ఆరోపణలపై మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోపణలను మంగ్లీ కొట్టిపడేశారు. మైక్రో ఫైనాన్స్ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని మంగ్లీ తేల్చి చెప్పారు. లాయర్ సుబ్బారావుపై మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







