ఈడీ ముందు హాజరైన సోనియా గాంధీ
- July 21, 2022
న్యూ ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అయిదుగురు ఆఫీసర్లు ఈమెను విచారించబోతున్నారు. అదనపు డైరెక్టర్ స్థాయి మహిళా అధికారి కూడా విచారణలో ఉండనుంది. ఆ మహిళా అధికారి దర్యాప్తు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఒకవేళ ప్రశ్నలు వేస్తున్న సమయంలో సోనియా అలసిపోతే, ఆమెకు రెస్ట్ ఇచ్చేందుకు కూడా ఈడీ అధికారులు ప్రిపేరయ్యారు. సోనియా వెంట తన కూతురు ప్రియాంకా కూడా ఈడీ ఆఫీస్ కు వచ్చారు. మరోపక్క ఈడీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తుండడం తో వారినంతా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు.
వాస్తవానికి జూన్ 8 నే సోనియా ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా.. జూన్ 02 న ఆమె కోవిడ్ -19 బారినపడింది. ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ తన అనారోగ్యం గురించి ఈడీకి లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని వారిని అభ్యర్థించారు. ఈడీ ఆమె అభ్యర్థనను ఆమోదించింది. సోనియా గాంధీ సమన్లను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని కోరారని, అందుకే జూలై 21న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది. ఈ తరుణంలో సోనియా నేడు ఈడీ ముందు హాజరయ్యారు.ఇదే కేసు లో రాహుల్ ను సైతం దాదాపు ఐదు రోజుల పాటు సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







