ఉపాధిని కల్పించేందుకు టాస్క్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న ఎల్&టీఎంఆర్హెచ్ఎల్
- July 21, 2022
హైదరాబాద్: ప్రభుత్వ, పరిశ్రమ, విద్యాసంస్ధలలో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్&టీఎంఆర్హెచ్ఎల్) మరియు తెలంగాణా అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ ఈ & సీ, తెలంగాణా ప్రభుత్వంలు నేడు ఓ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. సాంకేతికంగా అర్హతలు కలిగిన మరియు తెలంగాణా రాష్ట్రం నుంచి అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటుగా వారికి అవసరమైన శిక్షణను సైతం అందించనున్నారు.
టాస్క్ మరియు ఎల్& టీఎంఆర్హెచ్ఎల్కు ప్రాతినిథ్యం వహిస్తూ టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మరియు ఎల్& టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ&సీఈఓ కెవీబీ రెడ్డి ఈ అవగాహన ఒప్పంద పత్రాలను ముఖ్య అతిథి, తెలంగాణా రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్ , కమ్యూనికేషన్స్, పరిశ్రమలు, పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి శాఖామాత్యులు కె.టీ రామారావు ;అతిథి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఈ &సీ, ఐ & సీ ముఖ్య కార్యదర్శి మరియు టాస్క్ వైస్ ఛైర్మన్ జయేష్ రంజన్ ; హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ , ఎన్వీఎస్ రెడ్డి, ఐఆర్ఏఎస్, పూర్వ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, హైదరాబాద్ మెట్రో రైల్, కియోలిస్ హైదరాబాద్ సమక్షంలో మార్చుకున్నారు.ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని టీ హబ్‌లో నేడు జరిగిన టాస్క్ కార్పోరేట్ ఎంఓయు ఎక్సేంజ్ మరియు కాలేజ్ మేనేజ్మెంట్ మీట్లో జరిగింది.
ఈ ఎంఓయులో భాగంగా, టాస్క్ తమ విస్తృతస్థాయి డాటాబేస్‌లో ఉన్న అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటుగా ఎల్ & టీఎంఆర్హెచ్ఎల్కు మరియు దాని ఓ & ఎం భాగస్వామి కియోలిస్ హైదరాబాద్ మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రతిభావంతులతో కూడిన బృందాన్ని సిద్ధం చేయనుంది.
ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఉపాధి అవకాశాలను సృష్టించడం కోసం మరియు రాష్ట్రంలో యువతకు అదనపు నైపుణ్యాలను అందించడం కోసం తెలంగాణా ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటుంది. టాస్క్‌తో ఎల్& టీఎంఆర్హెచ్ఎల్ యొక్క ఈ ఒప్పందం హెచ్ఎంఆర్ ప్రయాణంలో అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. యువత సామర్ధ్యం మెరుగుపరచడంలో పరిశ్రమలో అగ్రగామిగా వెలుగొందుతున్న హెచ్ఎంఆర్ వారి కెరీర్‌ను మరింతగా వృద్ధి చేసే రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంతో పాటుగా తెలంగాణాలో ఉపాధి అవకాశాలను సైతం మెరుగుపరచనుంది’’ అని అన్నారు.
ఎల్&టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ&సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ ఎంఓయు ద్వారా మాతో టాస్క్ చేతులు కలిపినందుకు ధన్యవాదములు తెలుపుతున్నాము. నైపుణ్యాభివృద్ధి, రాష్ట్రంలో ఉపాధి కల్పన, సరైన ప్రతిభను సొంతం చేసుకోవడం పరంగా ఇది రెండు సంస్థలకూ పరస్పర ప్రయోజనం కలిగించనుంది. అలాగే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మెట్రో రైల్ రంగంతో పాటుగా హెచ్ఎంఆర్లో కెరీర్ అన్వేషించే వారికి అత్యుత్తమ అవకాశాలను సైతం అందిస్తుంది’’ అని అన్నారు
టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ ‘‘ఈ ఫస్ట్ డే ఫస్ట్ హవర్ స్కిల్లింగ్ మోడల్‌ను అమలు చేసేందుకు ఎల్&టీఎంఆర్హెచ్ఎల్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.ఈ ప్రతిష్టాత్మకమైన మెట్రో ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు వీలుగా యువత సాంకేతిక సామర్థ్యంలను మరింతగా మెరుగుపరుచుకోవడంలో ఇది సహాయపడుతుంది. తెలంగాణా యువత ప్రయెజనాల దృష్ట్యా మేము తీసుకువచ్చిన ప్రతిపాదనను అంగీకరించిన ఎల్–టీఎంఆర్హెచ్ఎల్, హెచ్ఎంఆర్ఎల్, కియోలిస్ మేనేజ్మెంట్కు ధన్యవాదములు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
ఎల్& టీఎంఆర్హెచ్ఎల్ మరియు కియోలిస్ హైదరాబాద్ యొక్క సాధారణ శిక్షణ మరియు రిక్రూట్మెంట్ ప్రక్రియకు అదనంగా ఈ ఎంఓయు పనిచేయనుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







