అర్థరాత్రి న్యూసెన్స్ సృష్టించిన ఆఫ్రికన్స్ అరెస్ట్

- July 22, 2022 , by Maagulf
అర్థరాత్రి న్యూసెన్స్ సృష్టించిన ఆఫ్రికన్స్ అరెస్ట్

దుబాయ్: తమ నివాసంలో అర్థరాత్రి వాగ్వాదానికి దిగి న్యూసెన్స్ సృష్టించిన ఆఫ్రికన్స్ వ్యక్తులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆఫ్రికన్ గ్రూప్ బహిరంగ ప్రదేశంలో కొట్లాడుతూ.. ఆస్తులకు నష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పోట్లాటకు దిగిన ఆఫ్రికన్స్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేసి తదుపరి చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయనున్నారు. దుబాయ్ పోలీస్ యాప్‌లోని 'పోలీస్ ఐ సర్వీస్' ద్వారా లేదా ఎమర్జెన్సీ హాట్‌లైన్ 999కి కాల్ చేయడం ద్వారా ఇటువంటి ప్రతికూల ప్రవర్తనను తెలపాలని ప్రజలను కోరింది. యూఏఈ ఫెడరల్ లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 52 ప్రకారం.. ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేసే ఏదైనా రెచ్చగొట్టే వార్తలను ప్రసారం చేయొద్దని సూచించింది. ప్రజా ప్రయోజనాలకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రజా క్రమానికి లేదా ప్రజారోగ్యానికి హాని కలిగించే వ్యక్తికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష, Dh100,000 కంటే తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com