ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు..
- July 22, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.ముంబై-అహ్మదాబాద్ మధ్య సేవలు అందించే ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానాలకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌లను ప్రారంభించామని ఇవాళ ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే, ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య విమాన సేవలు అందిస్తామని, వీటి బుకింగులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పింది.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సేవలకు గాను ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది.ఇప్పటికే కమర్షియల్ విమానాలు నడిపేందుకు లైసెన్సులను పొందింది. దశల వారీగా సేవలను విస్తరించుకుంటూ పోనుంది.కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







