బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ

- July 22, 2022 , by Maagulf
బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ

యూఏఈ: బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని యూఏఈ ప్రకటించింది. గోల్డ్ రిఫైనింగ్, బంగారు ఉత్పత్తుల రీసైక్లింగ్, విలువైన లోహాలు- రత్నాలు వీటిని నియమించబడిన నాన్-ఫైనాన్షియల్ వ్యాపారాలు, వృత్తులుగా వర్గీకరించే రంగంలో పనిచేసే కంపెనీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 28 విలువైన మెటల్ రిఫైనరీలు పనిచేస్తున్నాయి. జనవరి 2023 నుండి అమల్లోకి రానున్న కొత్త విధానం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50,000 నుండి 5 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా, జైలుశిక్షలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com