‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల

- July 23, 2022 , by Maagulf
‘ఆదిత్య T 20 లవ్ స్టోరీ’ ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్: ఆదిత్య హీరోగా, రమ్య, పవిత్ర, మాధురి హీరోయిన్లుగా ఎంజే క్రియేషన్స్ బ్యానర్ లో బేబీ మన్వితా చరణ్ అడపా సమర్పణలో చిన్నబాబు అడపా నిర్మిస్తున్న చిత్రం ‘ *ఆదిత్య T 20 లవ్ స్టోరీ’*. లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ అడపా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

ఆదిత్య T 20* లవ్ స్టోరీ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా కొత్తగా ఉంది. హీరో ఆదిత్య స్టైలీష్‌‌గా కనిపిస్తున్నాడు. కళ్లజోడు లుక్ కూడా కొత్తగా అనిపిస్తుంది.మొత్తానికి ఈ పోస్టర్‌‌తో అందరిలోనూ చిత్రయూనిట్ అంచనాలు పెంచేసింది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నట్లు మేకర్లు తెలిపారు.

ప్రభు తాళ్లూరి సహ నిర్మాతగా రాబోతోన్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా చిన్నబాబు అడపా, మ్యూజిక్ డైరెక్టర్‌గా చిన్ని చరణ్ అడపా, ఎడిటర్‌గా ఎంఆర్ వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి పాటలను వేల్పుల వెంకేటేష్ అందిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అభిషేక్ రూఫస్ సమకూరుస్తున్నారు.వియఫ్ఎక్స్ మరియు గ్రాఫిక్స్ ను అఖిల్ (ASD) అందిస్తున్నారు. మిక్సింగ్ ఇంజనీర్‌గా వినయ్, ఫ్లై క్యామ్‌ను సుమన్ చక్రవర్తి అందిస్తున్నారు.ఇక ఆర్ట్ డైరెక్టర్‌గా శివ, స్టంట్స్‌ బాధ్యతలను దేవరాజ్ నూనె,అంజి చేస్తున్నారు. ఈ చిత్రానికి మేకప్‌మెన్‌గా చరణ్ నెండ్రు పని చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ఆదిత్య, రమ్య, పవిత్ర, మాధురిలతో పాటు విజయ రంగరాజు, దత్తు, రాజనాల, అప్పారావు, మేరీ భావన వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. 

సాంకేతికవర్గం
బ్యానర్ : ఎంజే క్రియేషన్స్
సమర్పణ : బేబీ మన్వితా చరణ్ అడపా
నిర్మాత : చిన్నబాబు అడపా
సహ నిర్మాత : ప్రభు తాళ్లూరి 
దర్శకుడు : చిన్ని చరణ్ అడపా
కెమెరామెన్ : చిన్నబాబు అడపా
ఎడిటర్ : ఎంఆర్ వర్మ
మ్యూజిక్ : చిన్ని చరణ్ అడపా
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : అభిషేక్ రూఫస్
డైరెక్షన్ డిపార్ట్మెంట్ : మంజుప్రసాద్ 
వియఫ్ఎక్స్, గ్రాఫిక్స్: అఖిల్ (ASD)
మిక్సింగ్ ఇంజనీర్ : వినయ్
లిరిక్స్  : వేల్పుల వెంకేటేష్
మేకప్ : చరణ్ నెండ్రు 
పీఆర్వో : సాయి సతీష్,
 పర్వతనేని రాంబాబు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com