విజిటర్ డబ్బులు చోరీ.. ఇద్దరికి జైలుశిక్ష, జరిమానా
- July 23, 2022
దుబాయ్: ఒక ఆసియా విజిటర్ నుండి డబ్బులు అపహరించినందుకు దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ మిస్డిమీనర్స్ ఇద్దరు ఆసియన్లకు ఒక్కొక్కరికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు సంయుక్తంగా Dhs 50,000 జరిమానా విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత దోషులు బహిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత ఏప్రిల్‌లో నమోదైంది. ఒక ఆసియా విజిటర్ తన వద్ద ఉన్న 50,000 సౌదీ రియాల్స్ ను ఎమిరాటీ దిర్హామ్‌లుగా మార్చుకోవడానికి ఎమిరేట్స్ ID కార్డ్ లేనందున సహాయం చేయమని ఒక ఆసియా వ్యక్తిని కోరాడు. ఇద్దరూ నైఫ్ ప్రాంతంలోని ఒక ఎక్స్ఛేంజ్ ఆఫీసుకు వెళ్లారు. విజిటర్ నుండి 50,000 రియాల్స్ తీసుకొని.. ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ఉద్యోగికి అందజేశారు. ఆ తర్వాత అతడిచ్చిన దిర్హామ్‌లను అందుకున్న నిందితుడు.. ఎక్స్ఛేంజ్ కార్యాలయం నుంచి పారిపోయాడు. దీంతో విజిటర్ పోలీసులను ఆశ్రయించాడు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







