28 కార్లను తొలగించిన కువైట్ మునిసిపాలిటీ
- July 23, 2022
కువైట్: జ్లీబ్ అల్-షుయౌఖ్, సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతాల నుండి 28 పాడుబడిన కార్లను కువైట్ మునిసిపాలిటీ తొలగించింది. జహ్రాకు దక్షిణాన ఉన్న సాద్ అల్-అబ్దుల్లా ప్రాంతం నుంచి 15 కార్లు.. జిలీబ్ నుంచి 13 కార్లు తొలగించిన వాటిలో ఉన్నాయని ఫర్వానియా మున్సిపాలిటీకి చెందిన జనరల్ క్లీన్లీనెస్ అండ్ రోడ్ వర్క్స్ డిపార్ట్మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ డాక్టర్ నాసర్ అల్-రషీది తెలిపారు. జ్లీబ్ అల్-షుయౌఖ్, జిలీబ్లలో క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా పాడుబడిన 28 గుర్తించి, వాటిని మున్సిపాలిటీ రిజర్వేషన్ సైట్కు పంపినట్లు ఆయన తెలిపారు. కార్ల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







