ఖతార్ లో 29 కుక్కలను కాల్చి చంపిన దుండగులు

- July 23, 2022 , by Maagulf
ఖతార్ లో 29 కుక్కలను కాల్చి చంపిన దుండగులు

ఖతార్: సాయుధులైన కొందరు వ్యక్తులు స్థానిక కర్మాగారంపై దాడి చేసి 29 కుక్కలను కాల్చి చంపి, ఇతరులను గాయపరిచినట్లు  అల్ మయాస్సా బింట్ హమద్ అల్ థానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ సంఘటన గురించి వివరించారు. ఇది "ఆమోదయోగ్యం కాదు" అని ఘటనను తీవ్రంగా ఖండించారు. స్థానిక కర్మాగారంలోని కుక్కల్లో ఒకటి.. కుక్కులను చంపిన వారి పిల్లల్లో ఒకరిని కరిచినట్లు వారు పేర్కొన్నారని భద్రతా సిబ్బంది చెప్పారని పోస్టులో వివరించారు. అయితే, అధికారులు ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. అల్ థానీ కథనం ప్రకారం.. సాయుధులు భవనంలోకి చొరబడటానికి ముందు భద్రతా సిబ్బందిని బెదిరించారు. "ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకున్నందున భద్రతా సిబ్బంది భయపడ్డారు. న్యూటెర్డ్ కుక్కల సమూహాన్ని చంపకుండా సాయుధులను ఆపడానికి భద్రతా బృందం ప్రయత్నించి విఫలం అయ్యారు.’’ స్థానిక PAWS రెస్క్యూ ఖతార్ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com