నిషిద్ధ ప్రదేశాల్లో నిప్పంటించినందుకు SR3,000 జరిమానా
- July 24, 2022
రియాద్: తమకు కేటాయించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎవరైనా నిప్పు పెడితే జరిమానా విధిస్తామని పర్యావరణ భద్రత ప్రత్యేక దళాలు హెచ్చరించాయి. అడవులు లేదా జాతీయ ఉద్యానవనాలలో నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర ప్రదేశాలలో మంటలు పెడితే SR 3,000 వరకు జరిమానా విధించనున్నట్లు స్పెషల్ ఫోర్సెస్ తెలిపాయి. మక్కా, రియాద్ ప్రాంతాలలో 911, సౌదీ అరేబియాలోని మిగిలిన ప్రాంతాలలో 999, 996 నంబరులో పర్యావరణం లేదా వన్యప్రాణులపై దాడి చేసే ఏవైనా కేసుల సమాచారం ఉంటే తమకు తెలిపి సహకరించాలని భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. తాజాగా పర్యావరణ కాలుష్యానికి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను జెడ్డాలో తమ ఇన్‌స్పెక్టర్లు అరెస్టు చేసినట్లు పర్యావరణ భద్రత కోసం ప్రత్యేక బలగాల అధికారులు ప్రకటించారు. . సూడాన్ జాతీయులు రాగిని సేకరించే ఉద్దేశ్యంతో పారిశ్రామిక వ్యర్థాలను కాల్చడం ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేశారని, మట్టిని పాడు చేశారని స్పెషల్ ఫోర్సెస్ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







