కతార్ నేషనల్ లైబ్రరీ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్స్

- July 24, 2022 , by Maagulf
కతార్ నేషనల్ లైబ్రరీ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్స్

దోహా: కతార్ నేషనల్ లైబ్రరీ (QNL)  వేసవి సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు సమ్మర్ స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించనుంది. ముఖ్యంగా పిల్లలు, యువకులు, పెద్దల కోసం అనేక ఈవెంట్‌లను ప్లాన్ చేసింది. నైపుణ్యాల అభివృద్ధి, సంస్కృతి, ఆరోగ్య అవగాహన, కళలు, సాహిత్యం వంటి వివిధ అంశాలపై దృష్టి సారించింది. యువకుల కోసం జూలై 23 నుండి ఆగస్టు 11 వరకు వేసవి శిబిరం మూడవ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇందులో యువతకు సహాయపడే ఎనిమిది సెషన్‌లు ఉన్నాయి. ఆగస్టు 2 నుండి 27 వరకు లైబ్రరీ ప్రత్యేక పరిశోధనా సిరీస్‌లో భాగంగా అనేక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. ఇందులో అకడమిక్ రైటింగ్ స్కిల్స్, ప్రెజెంటేషన్‌లు, సాహిత్య సమీక్షలు, డాక్టోరల్ అధ్యయనాలను సమీక్షించడం, పరిశోధన విశ్లేషణ నిర్వహించడం వంటి ఏడు సెషన్‌లు ఉన్నాయి. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్‌కు మద్దతు ఇవ్వడంలో భాగంగా ఆగస్టు 4న తల్లిపాలపై అవగాహన కార్యక్రమాన్ని సిద్రా మెడిసిన్‌ భాగస్వామ్యంతో ప్లాన్ చేసింది. అలాగే పోషకాహారం, ఫిజియోథెరపీ, మానసిక ఆరోగ్య నిపుణులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా విద్యా సెషన్‌లను నిర్వహించనుంది. ఆగస్ట్ 16న సమాజం, క్రీడల మధ్య సంబంధం, క్రీడా లైబ్రరీల ప్రాముఖ్యత గురించి మాట్లాడేందుకు లుసైల్ విశ్వవిద్యాలయంలోని సీనియర్ ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్ జకారియా అల్-హక్కర్‌ను ఆహ్వానించింది. ఆగష్టు 20న "మ్యూజికల్ పోయెంట్రి ఈవెనింగ్"లో భాగంగా డా. మహ్రూస్ బోరాయెక్ మరియు డాక్టర్. ఒమర్ హజ్జా వారి అరబిక్ పద్యాలను వినిపంచనున్నారు. ఆర్టిస్ట్ రియాద్ బౌల్లామ్ ఔద్ సంగీత విభావరి నిర్వహిస్తున్నారు. ఆగస్టు 25న మడా అసిస్టెవ్ టెక్నాలజీ సెంటర్ సహకారంతో టెక్నాలజీపై వర్క్‌షాప్‌ నిర్వహిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com