కేటీఆర్ బర్త్‌డే గిఫ్ట్...
- July 24, 2022
హైదరాబాద్: కేటీఆర్ రేపు 47 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. వాస్తవానికి రేపు పెద్ద ఎత్తున కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరపాలని ప్లాన్ చేసినప్పటికీ..భారీ వర్షాల కారణంగా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబురాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటె కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా ఏపీకి చెందిన ఓ అమ్మాయి అరుదైన బహుమతిని అందజేసింది. చిన్నతనంలోనే తన రెండు చేతులను కోల్పోయిన ఈ అమ్మాయి.. నోటితో కేటీఆర్ రూపాన్ని స్కెచ్‌గా వేసింది. విజయనగరం జిల్లాకు చెందిన స్వప్నిక తన చిన్నతనంలో విద్యుత్ షాక్‌తో రెండు చేతులను కోల్పోయింది. రెండు చేతులు లేకపోయినా, ఆమె ఆత్మస్థైర్యం కోల్పోకుండా నోటితోనే పెయింటింగ్స్ వేయడం సాధన చేసింది. సినీ, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీల చిత్రపటాలను నోటితోనే పెన్సిల్ స్కెచ్ వేస్తుంటుంది. రేపు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. స్వప్నిక కేటీఆర్ చిత్రపటాన్ని గీసింది. తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఆ వీడియోను పోస్టు చేసింది.
‘కేటీఆర్ సార్.. మిమ్మల్ని కలవడానికి నాకు ఒక్క అవకాశం ఇప్పించండి. మీ ముందు నా కళను ప్రదర్శిస్తాను. నేను మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. మీ ప్రియమైన సోదరి (స్వప్నిక, మౌత్ ఆర్టిస్ట్)’ అంటూ ట్వీట్ చేసింది. స్వప్నిక ట్వీట్‌కు కేటీఆర్ బదులివ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







