ఇరాన్‌లో 5.3 భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు
- July 24, 2022
యూఏఈ: దక్షిణ ఇరాన్‌లో 5.3 భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 8:00 గంటలకు యూఏఈలో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారవర్గ నివేదికలు తెలిపాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8:07 గంటలకు భూకంపాన్ని నివాసితులు అనుభవించినట్లు NCM నివేదించింది. అయితే యుఎఇలో దాని ప్రభావం లేదని తెలిపింది. దక్షిణ ఇరాన్‌లో శనివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) శనివారం తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC వెల్లడించింది. ఈ భూకంపంలో ప్రాణ నష్టం గురించి ఇప్పుడే చెప్పలేమని, కాని దీనివల్ల పెద్ద ప్రాంతాలు దెబ్బతిన్నాయని హార్మోజ్గాన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ అధిపతి మొఖ్తర్ సలాషౌర్ చెప్పారు. మరోవైపు భూకంపాలు 5.7, 5.8 తీవ్రతతో వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తాజా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలో జూలై ప్రారంభంలో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించగా.. 49 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







