మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
- July 24, 2022
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో పాలన పగ్గాలు చేపట్టిన తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే బాలికల విద్యపై నిషేధం విధించడంతో పాటు మహిళా ఉద్యోగులపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులను విమర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
మాటలు, సైగలతో ఇలా ఏ విధంగా విమర్శించినా వారు శిక్షార్హులని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్‌ల అగ్ర నేత అఖుంద్‌జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు అంటున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం..
ఎవరైనా తాలిబన్ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఎలాంటి శిక్షలు విధించనున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఈ ఆదేశాలను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటితో వాక్‌స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







