జపాన్‌లో బద్ధలైన అగ్నిపర్వతం..
- July 24, 2022
టోక్యో: జపాన్‌లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. జపాన్ ఉత్తర భాగంలో ఉన్న క్యుషు (సకురజిమా) అనే పర్వత పరిధిలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్ధలైంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం పర్వతం బద్ధలై, లావా ఉప్పొంగుతున్నట్లు జపాన్ వాతావరణ శాఖ (జేఎమ్ఏ) వెల్లడించింది.
దీని ప్రభావం తీవ్రంగా ఉండటతో ఐదో నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు.దీన్ని హై అలర్ట్ కింద పరిగణిస్తారు. ప్రస్తుతం దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లావాకు చెందిన శిలలు ఎగిసిపడుతున్నాయి. మండుతున్న శిలలు ఎగిరిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రస్తుతం బద్ధలైన అగ్నిపర్వతానికి సమీపంలో కగోషిమా అనే పట్టణం ఉంది. ఇక్కడ దాదాపు ఆరు లక్షల మంది నివసిస్తున్నారు. సకురజిమ జపాన్‌లో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతం. ఇక్కడ తరచూ లావా బద్ధలవుతుంటుంది. 2019లో 5.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది.
జపాన్ భూభాగం ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్స్ పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు రావడంతోపాటు, అగ్నిపర్వతాలు, సునామీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే భూకంపాల్లో 20 శాతం జపాన్‌లోనే నమోదవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







