రోడ్డు పనుల్ని వేగవంతం చేయాలి
- April 13, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్) వీధులు, రోడ్లపై చేపడుతున్న పనుల్ని వేగంగా పూర్తి చేయాలని సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ (సిఎంసి) కోరింది. పగుళ్ళు, తవ్వకాలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని, దీని కోసం తగిన చర్యలు చేపట్టాలని సిఎంసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సిఎంసి మెంబర్ నెమ్మదిగా పనులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. టెలిఫోన్ లైన్లు, వాటర్ లైన్స్, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లయ్ కేబుల్స్ కోసం రోడ్ల మధ్యన తవ్వకాలు చేపట్టరాదనీ, రోడ్ల పక్కనే ఎక్కువ ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సిఎంసి సూచించింది. కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల్ని అష్గల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, టెక్నాలజీని వినియోగించుకునే దిశగా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవాలని కోరింది. అలాగే, మహిళా వస్త్ర దుకాణాల్లో పనిచేయడానికి పురుషులకు అవకాశం లేకుండా కేవలం మహిళలకే అవకాశం ఇవ్వాలన్న రికమండేషన్‌పై, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్కి ఫిర్యాదులు రాగా, దాన్ని మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్‌కి దాన్ని రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







