చెల్లెలి తెరంగేట్రంపై ఉద్వేగానికి గురైన జాన్వీ కపూర్.!

- July 25, 2022 , by Maagulf
చెల్లెలి తెరంగేట్రంపై ఉద్వేగానికి గురైన జాన్వీ కపూర్.!

అతిలోక సుందరి ముద్దుల తనయగా జాన్వీ కపూర్ సినిమాల్లో వున్నతమైన స్థాయిలో వుండాల్సింది. కానీ, అది జరగలేదు. జాన్వీ కపూర్‌ని తన తర్వాత తన లెగసీని నిలబెట్టే వారసురాలిగా తీర్చి దిద్దేందుకు అతిలోక సుందరి శ్రీదేవి చాలా తాపత్రయ పడింది.
సినిమాలకు పరిచయం చేయడానికి ముందే, జాన్వీకి నటనలో, డాన్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి రాటు దేలేలా తయారు చేసింది. కానీ, జాన్వీ ఎంట్రీని చూడకుండానే శ్రీదేవి ఆకస్మిక మరణం పొందింది.

దాంతో జాన్వీ కపూర్ సినిమా జీవితం బహు దుర్భరంగా మారిపోయిన సంగతి తెలిసిందే. శ్రీదేవికి ప్యాన్ ఇండియా రేంజ్ గుర్తింపు వున్న సంగతి తెలిసిందే. అదే గుర్తింపు జాన్వీ కపూర్ కూడా దక్కించుకోగల స్టామినా వుంది. కానీ, తెర వెనుక ఏం జరుగుతుందో ఏమో కానీ, జాన్వీ రేసులోకి రాలేకపోతోంది. 

ఇదిలా వుంటే, తాజాగా జాన్వీ కపూర్ చెలెల్లు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి డెబ్యూ చేయబోతోంది. షుషీ తెరంగేట్రం గురించి మాట్లాడుతూ, జాన్వీ కపూర్ ఒకింత వుద్వేగానికి లోనైంది. 

అమ్మ బతికి వుంటే, నా బాధ్యతతో పాటూ చెల్లెలి బాధ్యత కూడా తనే చూసుకునేది. కానీ, ఇప్పుడు నేను అమ్మ స్థానంలోకి వచ్చాను. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకున్నాను. కానీ, ఖుషీ నాలా కాదు.. చాలా మెచ్యూర్.. అంటూ చెల్లెలి గురించి ఇంట్రో ఇస్తూ, తల్లిని గుర్తు చేసుకుని తీవ్ర ఆవేదనకు లోనైంది జాన్వీ కపూర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com