ట్రెండు మారింది బాస్.! మీరెప్పుడు గుర్తించరా.. బిగ్ బాస్.!
- July 25, 2022
జనామోదం వున్న సినిమాల్లో మాత్రమే నేను నటిస్తాను.. ప్రయోగాల జోలికి అస్సలు పోను.. అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాని తెలుగులో చిరంజీవి ప్రెజెంట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అమీర్ ఖాన్ మంచి నటుడు.. అని అభివర్ణిస్తూ, ఆయన చేసే సినిమాల తరహా సినిమాలు నేను చేయలేను.. నేను ప్రజామోదం వున్న సినిమాలు మాత్రమే చేయగలను.. అని చిరంజీవి సెలవిచ్చారు.
అంటే, ప్రయోగాల జోలికి పోనని చిరంజీవి క్లియర్ కట్‌గా చెప్పేశారు. కానీ, సినిమాల విషయంలో ఆడియన్స్ ఆలోచనలు చాలా వేగంగా మారిపోతున్నాయ్. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంకరేజ్ చేయడం లేదు కూడా.
అంతేకాదు, చిరంజీవి యంగ్ జనరేషన్‌కి ఇన్సిస్రేషన్. యంగ్ జనరేషన్ నుంచి మంచి మంచి ప్రయోగాత్మక సినిమాలు రావాలని సూచనలిచ్చే చిరంజీవి ఆయన కూడా ప్రయోగాలు చేయాలి కదా. వెరసి, ‘విక్రమ్’ సినిమాతో సీనియర్ నటుడు కమల్ హాసన్ ఓ పెద్ద ప్రయోగమే చేశాడు. అభిమానులూ ఆదరించారు.
అలాగే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పలు ప్రయోగాత్మక సినిమాల్లో నటిస్తున్నారు. మరి, చిరంజీవి ఎందుకు చేయకూడుదు అధ్యక్షా.!
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







