బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన 23 మంది అరెస్టు
- July 27, 2022
జెడ్డా: బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన కేసులో 23 మంది విదేశీ నివాసితులను సౌదీ అరేబియాలోని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయంటూ బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ బాధితులకు మెసేజ్ లు పంపేవారని, బాధితులు తమ కార్డులను తిరిగి యాక్టివేట్ చేయాలంటే ఓటీపీ నంబర్లను తెలపాలని కోరేవారని, ఓటీపీ నెంబర్ చెప్పగానే నిందితులు బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులను విత్‌డ్రా చేసేవారని పోలీసులు వివరించారు. జెడ్డా పరిసరాల్లోని సెమీ ఎడారి ప్రాంగణాలను నిందితులు తమ స్థావరంగా మార్చుకున్నారని.. నిందితుల వద్ద నుంచి 46 మొబైల్ ఫోన్లు, 59 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..