ఫిషింగ్ స్కామ్‌లతో జాగ్రత్త.. డిజిటల్ బ్యాంకింగ్ కస్టమర్లకు హెచ్చరిక

- July 28, 2022 , by Maagulf
ఫిషింగ్ స్కామ్‌లతో జాగ్రత్త.. డిజిటల్ బ్యాంకింగ్ కస్టమర్లకు హెచ్చరిక

రియాద్: సౌదీ అరేబియాలోని మెజారిటీ వినియోగదారులు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా మొబైల్ వాలెట్ సేవలను ఉపయోగిస్తున్నప్పుడు ఫిషింగ్ స్కామ్‌లను ఎదుర్కొంటున్నారని కాస్పర్‌స్కీ(Kaspersky) డిజిటల్ పేమెంట్ సర్వే తెలిపింది. సౌదీ అరేబియా నుండి 57 శాతం మంది డిజిటల్ బ్యాకింగ్ వినియోగదారులు ఫిషింగ్ స్కామ్‌లను ఎదుర్కొన్నారని.. 46 శాతం మంది వ్యక్తిగతంగా నకిలీ వెబ్‌సైట్‌లను ఎదుర్కొన్నారని, 58 శాతం మంది టెక్స్ట్‌లు లేదా కాల్‌ల ద్వారా స్కామ్‌ల బారిన పడ్డారని సర్వే నివేదిక పేర్కొంది. మాల్వేర్ ల దాడి వెక్టర్‌లను ఫిల్టర్ చేయగల అధునాతన భద్రతా పరిష్కారాలు, మంచి సైబర్‌ సెక్యూరిటీ అవగాహన, సాధారణ పాస్‌వర్డ్ మార్పుల వంటి ఇతర నివారణ చర్యలతో అనుబంధంగా ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయని కాస్పర్‌స్కీలో సాంకేతిక నిపుణులు, మిడిల్ ఈస్ట్, టర్కీ, ఆఫ్రికా హెడ్ ఇమాద్ హాఫర్ తెలిపారు. ఇటీవల, సౌదీ సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక రంగంలో మోసాలు, కుంభకోణాలపై పోరాటంలో తన ప్రయత్నాలను వేగవంతం చేస్తోన్న విషయం తెలిసిందే. మోసాల కేసులను పర్యవేక్షించడానికి బ్యాంకుల కోసం జాయింట్ ఆపరేషన్స్ సెంటర్‌ను ప్రారంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com