అబ్దుల్లా అల్-ముబారక్‌ను సందర్శించిన నూన్ వర్క్ బ్యాన్ టీమ్
- July 28, 2022
కువైట్: దక్షిణ సబర్బ్ అబ్దుల్లా అల్-ముబారక్ ను నూన్ వర్క్ బ్యాన్ టీమ్ హెడ్, జహ్రా గవర్నరేట్‌లోని ఆక్యుపేషనల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హెడ్ హమద్ అల్-మఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా హమద్ అల్-మఖిల్ మాట్లాడుతూ.. 10 కంటే ఎక్కువ ప్లాట్లు, 300 కంటే ఎక్కువ కంపెనీలు సందర్శించి నూన్ వర్క్ చట్టం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్మికులు, కంపెనీలు చట్టాలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు నిబంధనలు ఉల్లంఘించిన సైట్లను 48 గంటల తర్వాత మరోసారి తనిఖీ చేసినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం కొనసాగించినట్లయితే కంపెనీ ప్రతి కార్మికుడికి 100 నుండి 200 దీనార్ల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుందని, న్యాయ వ్యవహారాల విభాగానికి ఫైల్ పంపిస్తామని, కంపెనీని 'బ్లాక్' జాబితాలో చేర్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండాకాలంలో కార్మికులు ఉదయం 11 నుండి 4 గంటల వరకు పని చేయకుండా నూన్ వర్క్ చట్టం రక్షణ కల్పిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







