'ఉప్పెన' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా.?
- July 28, 2022
‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు, బుచ్చిబాబు సన. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడీ టాలెంటెడ్ డైరెక్టర్. తొలి సినిమా అయినా ‘ఉప్పెన’ ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆ స్థాయి హిట్ ఇచ్చినా తదుపరి సినిమా ఇంతవరకూ అనౌన్స్ చేయలేదు బుచ్చిబాబు. అందుకు ఓ పెద్ద కారణమే వుందట. ఎన్టీయార్‌తో తన రెండవ సినిమా డైరెక్ట్ చేయాలన్నదే బుచ్చిబాబు నిర్ణయమట. ఆల్రెడీ ఎన్టీయార్‌కి కథ కూడా నెరేట్ చేశాడట. అయితే, ఈ ప్రాజెక్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదింతవరకూ. ఎన్టీయార్ ఇప్పటికే స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు సెట్ చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి కొరటాల సినిమా కాగా, ఆ తర్వాత ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాలూ పూర్తియితే కానీ, బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కడానికి లేదు.
అయితే, ఈ లోపు బుచ్చిబాబు తన టాలెంట్‌ని గురువు గారు సుకుమార్ కోసం వినియోగిస్తున్నాడట. సుకుమార్ తెరకెక్కించబోయే ‘పుష్ప 2’కి రైటర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడట. ఆల్రెడీ సుకుమార్‌తో కలిసి ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు బుచ్చిబాబు పని చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!