విజయ్ దేవరకొండ ఎఫైర్‌ని లీక్ చేసిన కరణ్ జోహార్.!

- July 28, 2022 , by Maagulf
విజయ్ దేవరకొండ ఎఫైర్‌ని లీక్ చేసిన కరణ్ జోహార్.!

‘కాఫీ విత్ కరణ్’ పేరుతో ఓ గేమ్ షో నిర్వహిస్తున్నాడు కరణ్ జోహార్. బాలీవుడ్ ఫేమస్ ఫిలిం మేకర్‌గా కరణ్ జోహార్‌కి మంచి పేరుంది. అయితే, ఆ పేరును ఈ షో పేరు చెప్పి బాగా వాడేసుకుంటున్నాడు.. అనవసరంగా వివాదాల్లోకెక్కుతున్నాడు.. అంటూ కరణ్‌పై విమర్శలు కూడా వున్నాయ్.

అయినా కానీ, కరణ్ జోహార్ హోస్ట్‌గా నడిచే ఈ ప్రోగ్రామ్‌కి వున్న క్రేజ్ వేరే లెవల్. స్టార్ సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫిషనల్ సీక్రెట్లను చాలా బోల్డ్‌గా బయట పెట్టేస్తుంటాడు కరణ్ జోహార్ ఈ ప్రొగ్రామ్ ద్వారా. 

అలా మొన్న సమంత సీక్రెట్స్ బయట పెట్టిన కరణ్ జోహార్ ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గుట్టు విప్పేయనున్నాడు. విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ గురించి కూపీ లాగాడు. కానీ, రౌడీ బయట పడలేదు.

ఇక, ఎవరితోనైనా రిలేషన్‌షిప్స్ వున్నాయా.? అంటూ కిందా, పైనా, ముందూ, వెనకా కెలికి మరీ గుట్టు లాగేందుకు గట్టి ప్రయత్నాలే చేశాడు. కానీ, అమ్మో దేవరకొండ.. అస్సలు బయటపడలేదు. నన్ను చాలా మంది అభిమానులు ప్రేమిస్తున్నారు.. అలాగే హీరోయిన్లు కూడా ప్రేమిస్తున్నారు అంటూ నలుగురైదుగురు అందగత్తెల పేర్లు చెప్పి, అభిమానంతో కూడిన ప్రేమ అది.. అంటూ ట్విస్ట్ ఇచ్చాడు.

రిలేషన్‌షిప్ సీక్రెట్ మాత్రం విజయ్ నుంచి రప్పించడం కరణ్ వల్ల కాలేదు. విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ సినిమాకి కరణ్ ప్రోడ్యూసర్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com