హిజ్రీ న్యూ ఇయర్ హాలిడే.. షార్జాలో ఉచిత పార్కింగ్

- July 29, 2022 , by Maagulf
హిజ్రీ న్యూ ఇయర్ హాలిడే.. షార్జాలో ఉచిత పార్కింగ్

యూఏఈ: హిజ్రీ నూతన సంవత్సరం (1444H) సందర్భంగా మొహర్రం 1న ఉచిత పార్కింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం.. శుక్రవారాలు, అధికారిక సెలవులతో సహా వారం మొత్తం రుసుములకు లోబడి ఉండే పార్కింగ్ జోన్‌లను మినహాయించింది.  హిజ్రీ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జూలై 30(శనివారం) న యూఏఈలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. మొహర్రం 1.. ఇస్లామిక్ కొత్త సంవత్సరం (1444H) ప్రారంభాన్ని సూచిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com