అద్భుత సామర్థ్యాలతో అబ్బురపరుస్తున్న భారతీయ బాలిక
- July 29, 2022
కువైట్: రెండు చేతులతో ఏకకాలంలో 11 విభిన్న శైలులలో రాయగల సామర్థ్యంతో ఆది స్వరోబా అనే 17 ఏళ్ల బాలిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా స్వరోబా కళ్లకు గంతలు కట్టుకొని వ్యతిరేక దిశలలో వివిధ భాషలలో ఏకకాలంలో రాయగలిగే సామర్థ్యాలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా స్వరోబా మాట్లాడుతూ..గిన్నిస్ రికార్డు బుక్ లో స్థానం పొందే లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు తెలిపారు. ఆమె విజువల్ మెమరీ అద్భుతంగా ఉందని, కాలిగ్రఫీ ద్వారా పదాలను సూచించే సామర్థ్యం ఆమెకు ఉందని పలు వార్తపత్రికలు తమ కథనాల్లో ప్రశంసలు కురిపించాయి. స్వరోబా తరచుగా ఇలాంటి వీడియోలు రూపొందించి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తుంది. హిందుస్థానీ సంగీతాన్ని కూడా అభ్యసిస్తున్న స్వరోబా.. సాంప్రదాయ కన్నడ థియేటర్లో 50 సార్లు ప్రదర్శనలు ఇవ్వడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







